15 April, 2026 | 12:29 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి

25-02-2026 12:23 AM
  1. జూన్ 2 నాటికి ఆ రెండు వంతెనలు పూర్తి కావాలి

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, హెచ్-సిటీ ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలోని అన్ని జోన్ల పరిధిలో కొనసాగుతున్న కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

జోనల్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్టు తాజా పరిస్థితిని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్‌కు వివరించారు. పెండింగ్ పను లు, వాటి జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రాజెక్టుల వేగవంతానికి అధికారులకు దిశాని ర్దేశం చేశారు.ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి బల్దియా వద్ద ఎలాంటి నిధుల కొరత లేదని కమిషనర్ స్పష్టం చేశారు.

రోడ్ల విస్తరణ, ఫ్లుఓవర్ల నిర్మాణంలో ప్రధాన అడ్డంకిగా మారిన యుటిలిటీ షిఫ్టింగ్ విద్యుత్, నీటి పైపుల మార్పిడి, పెండింగ్ భూసేకరణ ప్రక్రియలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా నగర వాసులకు ఎంతో కీలకమైన మూసారంబాగ్ హైలెవల్ బ్రిడ్జి, నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లుఓవర్ పనులను మిషన్ మోడ్లో చేపట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు, డెడ్‌లైన్ జారీ చేశారు.