ఇవేం ఎండలు బాబోయ్.. నిప్పుల వాన
కరీంనగర్, ఏప్రిల్27(విజయక్రాంతి):ఉమ్మడి జిల్లాలోపగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. మే నెల రాకముందే భాణుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే రెండు రోజులు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గనున్న న్నా తీవ్రత ప్రభావం తగ్గేలాలేదు. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
ఉదయం 7 గంటల నుంచి ఎంద ప్రచంఢంగా విజృంభిస్తుంది. జగియ్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 44 డిగ్రీలు నమోదు కాగా, కరీంనగర్, పెద్దపల్లి లలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుఅయ్యాయి. ఈక్రమంలో నాలుగు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్జ్ జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈ ఏడాది వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం కానున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించిండం ఊపిరి పీల్చుకునే అంశం.






