calender_icon.png 13 August, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇస్తే తప్పేంటి

11-08-2025 01:28:34 AM

  1. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ సంభాషణ

వీక్షించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, నేతలు

మహబూబ్ నగర్ ఆగస్టు 10 (విజయ క్రాంతి) : డిజిటల్ ఓటర్ లిస్టు ఇవ్వమని అడిగితే ఈసీ ఇవ్వటం లేదంటే దేశం ఎటువైపు ప్రయాణిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. దేశ ప్రజలకు పూర్తిస్థాయి లో బిజెపి ఏం చేస్తుందని విషయాలను తెలియజేసేందుకే కాంగ్రెస్ పార్టీ అధినేత రా హుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు అందించ డం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన హక్కులను కాపాడుకోవటానికి రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం ఓటు హక్కు అని, ఓటు హక్కు తో ప్రజాస్వామ్య రూపురేఖలనే మార్చవచ్చన్నారు.అలాంటి ఓటు హక్కునే భాజపా ఓటు హక్కును దొంగతనం చేసిందని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మహారాష్ట్ర,మధ్యప్రదేశ్ ,హర్యానా లో పూర్తిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికి భాజపా గెలిసిందే అ న్నారు.

లోతుగా అధ్యయనం చేయాలనే ఉద్దేశ్యంతో ఒక బృందాన్ని రాహుల్ నియమించి నిజాలు నిగ్గుదెల్చారని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భాజపా ప్రాడ్ కు పాల్పడింది అనే విషయాన్ని ఈసీ కి పిర్యాదు చేసిన పట్టించు కోలేదని విమర్శించారు. బెంగళూరు సెంట్రల్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నప్పటికి మా అభ్యర్థి 32 వేల ఓట్ల మెజారిటీతో భాజాప అభ్యర్థి గెలు పు సాధించారని తెలిపారు.

ఒక్క మహదేవ్ పుర నియోజక వర్గంలో నే 1లక్ష 250 పై చిలుకు నకిలీ ఓట్లను క్రియేట్ చేశారన్నారు. తనను తాను విశ్వ గురువుగా చెప్పుకునే మోడీ ఇలాంటి మోసపూరిత చర్యలకు పా ల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు. ఎన్నికల సరళి పారదర్శకంగా ఉండాలనేది మా అభిమతం బ్యాలెట్ పద్ధతిని పునరుద్ధరించాలన్నారు. 

ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ రాష్ట్ర చైర్మన్ ఒబెదుల్లా కోత్వాల్ ఒ లింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు యన్.పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శులు సం జీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత రెడ్డి, తదితరులు ఉన్నారు.