calender_icon.png 13 August, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఎల్‌ఐ కాల్వకు గండి!

11-08-2025 01:34:46 AM

  1. వృథాగా పోతున్న వరదనీరు 

నీటమునుగుతున్న సమీప పంటపొలాలు 

నాగర్‌కర్నూల్, ఆగస్టు 10 (విజయక్రాంతి):  జిల్లాలోని వెల్దండ మండలంలోని లచ్చపురం సమీపంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్‌ఐ) డీ82 కాల్వకు ఆదివారం గండిపడింది. వరద ప్రవాహం పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో వరద నీరు వృథాగా పోతుంది. ఏడాది కా లంలోమండల పరిధిలోనే ప్రధాన కాల్వకు గండిపడటం ఇది ఐదోసారి. మొత్తంగా కా లువ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఎనిమి ది సార్లు గండిపడింది.

దీంతో  నీరంతా వృ థాగా పోయి చివరి కాలువకు అందక పంట లు ఎండిపోతున్నాయి. గండిపడిన ప్రతిసారి కాల్వకు ఆనుకొని ఉన్న తమ పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏటా ఇదే తంతు పునరావృతమవుతున్నా, అధికారులు ముం దస్తు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు.