11-08-2025 01:27:29 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం ఒకవైపు ఎన్నికలకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు కార్యా చరణను కూడా ప్రారంభించింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం బ్యాలెట్ పేపర్లను ఇప్పటికే ముద్రించింది.
గత కొంతకాలంగా ఎన్నికలు వస్తాయనే ప్ర చారం నేపథ్యంలో ఏడు నెలల క్రితమే రూ. 75 కోట్లతో బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేసిం ది. అయితే ఆ బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బా క్స్‌ల భద్రత అధికారులకు పరీక్షగా మారిం ది. రాష్ర్టవ్యాప్తంగా 50 వేల బ్యాలెట్ రిమ్స్ (25 వేల పింక్, 25 వేల వైట్) ఏర్పాటు చేశా రు. 48 వేల బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. ముద్రించిన బ్యాలెట్ పేపర్లు జిల్లా కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచారు.
అయితే సరైన నిల్వ, భద్రత లేకపోతే దుమ్ము,ధూళీతోపాటు చెద లు పట్టే అవకాశం లేకపోలేదు. కొన్ని జిల్లా ల్లో భద్రపరిచేందుకు సరైన గోదాములు లేవనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాలెట్ పేప ర్లు చిరిగినా, వాటిపై ముద్రించిన గుర్తులు చెదిరినట్లు కనిపించినా ఉపయోగించడం సాధ్యం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ బ్యాలెట్ పత్రా లను ముద్రించాల్సి ఉంటుందని, దీంతో స మయం వృథా కావడంతోపాటు ప్రభుత్వానికి అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ఇతర రాష్ట్రాల నుంచి
రాష్ర్టంలో 48 వేలకు పైగా పోలింగ్ బా క్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదనంగా కర్ణాటక, ఏపీ నుంచి 18 వేల బాక్స్‌లను అదనంగా ప్రభుత్వం తెప్పించిం ది. అయితే ఏడు నెలల క్రితం మైసూరు పే యింట్స్ అండ్ వార్నిష్‌కు చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం బ్యాలెట్ పేపర్, ఇంకు బాటిల్స్ ఆర్డర్ ఇచ్చి రాష్ట్రానికి తెప్పించారు.
ఎన్నికల్లో కీలకమైన సిరా(ఇంక్) బాటిల్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందని అధికారులు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల కోసం1.48 లక్షల పాయిల్స్ బాటిళ్లు, పరిషత్ ఎన్నికల కోసం 48 వేల పాయిల్స్ బాటిళ్లను ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్లు సమాచారం. సర్పంచ్‌లకు సంబంధించి 25 నుంచి 30 గుర్తులు కేటాయించగా.. అభ్యర్థులకు అల్ఫాబెటికల్ ఆర్డర్‌లో కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం.
తనిఖీ చేయాలని ఆదేశాలు
ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నడటంతో బ్యాలె ట్ పేపర్లు, బాక్సులను భద్రంగా ఉం చాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన రాష్ర్టంలోని అన్ని జిల్లా అధికారులతో ఈ అంశంపై వీడియో కా న్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశాలు జారీ చేశారు.
బ్యాలెట్ పేప ర్లు, బాక్స్‌ల నిల్వ స్థానాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, వాటిని త డి, దుమ్ము, చెదల నుంచి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తుండటంతో బ్యాలెట్ పేపర్, బాక్స్‌ల భద్రతపై నిఘా పెట్టాలని సూచించా రు. బ్యాలెట్ పత్రాలు సరిగ్గా లేకపో తే వెంటనే తెలియజేస్తే, వాటిని మళ్లీ ముద్రించే అవకాశం ఉంటుంది.
రా ష్ర్ట వ్యాప్తంగా ఎంపీటీసీలు స్థానా లు 5,773.. ఎంపీపీలు, జడ్పీటీసీల స్థానాల సంఖ్య 566 ఉందని ప్రభు త్వం ప్రకటించింది. 1 2,778 గ్రామపంచాయతీలు, 1,12, 694 వార్డులు ఉన్నాయని పేర్కొంది. ఎన్నికలు ఎ ప్పుడు వచ్చినా నిర్వహించేందుకు స న్నద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.