16-10-2025 12:00:00 AM
పెంట్లవెల్లి అక్టోబర్ 15 : మండల కేంద్రంలోని కొండూరు రోడ్డు అద్వానంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు, ఏళ్ల తరబడి గుంతలు ఉన్నా ఏ నాయకుడు వచ్చినా పట్టించుకోవడంలేదని వర్షాకాలం వర్షాలు ఎక్కువ రావడంతో రోడ్డు గుంతలలో వాహనదారులు రోడ్డుపై పోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు,
పాత ఉమ్మడి మండలం వీపనగండ్ల మండలానికి కొండూరు మీద పోవాల్సి ఉన్నా కూడా సమయానికి బస్సులు కూడా రావని వచ్చినా కూడా ఉదయం వేల కర్నూల్, హైదరాబాద్ , వనపర్తికి బస్సులు పోతే మళ్ళీ రాత్రికి వస్తాయని మిగతా సమయంలో బస్సులు రాక ప్రైవేట్ ఆటోలకు కొరకు ఎదురుచూడాల్సి వస్తుందని మహిళలు చెబుతున్నారు, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలుకోరుతున్నారు,