15-10-2025 11:15:24 PM
జిల్లాకు రానున్న ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్..
డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ..
మంచిర్యాల (విజయక్రాంతి): సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేసేందుకు జిల్లాకు ఏఐసీసీ ప్రతినిధి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్ రానున్నారని డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్ రావు బుధవారం వెల్లడించారు. 16న సాయంత్రం నాలుగు గంటలకు నార్తిన్ హోటల్ లో విలేకరుల సమావేశం, ఐదు గంటలకు ఎం కన్వెన్షన్ హాలులో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశం ఉంటుందన్నారు.
డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి దరఖాస్తు ఫారాలు అందజేస్తారన్నారు. 17న మధ్యాహ్నం రెండు గంటలకు బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్, మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 18న చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం చెన్నూర్ లో ఉదయం 11 గంటలకు ఉంటుందని, 19న ఉదయం పది గంటలకు డీసీసీ అధ్యక్షుడిగా దరఖాస్తు చేసుకున్న వారితో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు.