8 August, 2026 | 3:39 PM

రాగన్నగూడ పాత రోడ్డుకు మోక్షమేది?

08-08-2026 02:04 PM

బోనాల పండుగ వేళా ఇబ్బందులు పడుతున్న ప్రజలు

​ఆదిభట్ల, అగస్టు 8(విజయక్రాంతి): తొర్రూర్ డివిజన్‌లోని రాగన్నగూడ పాత విలేజ్ రోడ్డు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడటంతో, వర్షం కురిస్తే నీరు నిలిచి తీవ్ర బురదమయంగా మారుతోంది.శ్రావణ మాసం బోనాల పండుగ సమీపిస్తున్న వేళ ఆలయాలకు వెళ్లే భక్తులు, మహిళలకు ఈ రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులుఎదురుకానున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు అభివృద్ధికి టీయ్ఎఫ్ఐడిసీ నుంచి మంజూరైన రూ. 75 లక్షల నిధులను స్థానిక ఎమ్మెల్యే వేరే ప్రాంతానికి మళ్లించారని మాజీ కౌన్సిలర్ రొక్కం అనిత చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.నిరసనగా రోడ్డుపైనే వరి నాట్లు వేసినా, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా మార్పు రాలేదని బీజేపీ నాయకుడు ఎలిమినేటి నరసింహారెడ్డి మండిపడ్డారు.​బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలికంగా గుంతలను పూడ్చాలని, శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.