తుర్కయాంజల్ రైతు సేవా సహకార సంఘంలో రూ.1.83 కోట్ల రుణాల మంజూరు
08-08-2026 02:05 PM
ఆదిభట్ల ఆగస్టు 8: (విజయక్రాంతి): తుర్కయాంజల్ రైతు సేవా సహకార సంఘం పీఐసీ సమావేశం చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 8 మంది కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు, 15 మంది రైతులకు రూ.1.83 కోట్ల రుణాలు మంజూరు చేశారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మే–జూలై నెలల జమా–ఖర్చులను ఆమోదించి, 55వ సర్వసభ్య సమావేశాన్ని సెప్టెంబరులో నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో పీఐసీ సభ్యులు కొత్త రాంరెడ్డి,వంగేటి లక్ష్మారెడ్డి,సామ సంజీవరెడ్డి, కుతడి నర్సింగ్‌రావు, కోండ్రు స్వప్న, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, జక్క కృష్ణారెడ్డితో పాటు సంఘ కార్యదర్శి వై. రాందాస్ తదితరులు పాల్గొన్నారు.






