20 March, 2026 | 5:18 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

భవనం పూర్తయ్యేదెప్పుడో.?

01-11-2024 01:56 PM

అనంతగిరి, (విజయ క్రాంతి): ఏండ్లుగా నిలిచిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఆశలు అనంతగిరి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల ఏళ్లు గడిసిపోతున్నా ఇప్పటివరకు పాఠశాల భవనం పూర్తి కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీన్ని నిర్మాణం చేపట్టగా వివిధ కారణాలతో పనులు చివరి దశలో ఆగిపోయాయి. తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు ఈ పాఠశాల మరోపక్క నడుపుతున్న సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా కొంత దూరంలో ఉండడంతో విధులు నిర్వహించేందుకు ఇబ్బందికరంగా ఉందని అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన పాఠశాల భవనం నిర్వహించేందుకు బిఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొంతవరకు పనులు జరిగాయి చివరి దశకు చేరిన తర్వాత గుత్తేదారులకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదలలో జాప్యంతో పనులుఆగిపోయాయ త్వరలో భావన నిర్మాణం చేపట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ సమస్య పరిష్కారం అవుతుందని మండల ప్రజలు విద్యాధికారులు గుత్తేదారు వారంతా ఆశ పెట్టుకున్నారు.