25 April, 2026 | 2:42 AM

ఆసరా అందేదెప్పుడో..?

25-04-2026 01:07 AM
  1. యేండ్ల తరబడి ఎదురుచూస్తున్న అభాగ్యులు
  2. ప్రజాపాలనలోనూ అత్యధికంగా వస్తున్న అర్జీలు
  3. మండలస్థాయిలో కుప్పలుతెప్పలుగా అప్లికేషన్స్

పాలకవీడు, ఏప్రిల్ :24 :సమాజంలో ఎలాంటి ఆదరణలేక ఆర్థికంగా చితికిపోయిన అభాగ్యులకు ప్రభుత్వం మంజూరు చేసే కొత్త ఆసరా పింఛన్లు నిపివేయడంతో వేలాది మందికి ఎదురుచూపులు తప్పడంలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కొత్త ఆసరా పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల వ్యాప్తంగా దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చాలామంది దరఖాస్తులు అందజేస్తున్నారు. గ్రామసభల్లో కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. గత నాలుగేండ్లుగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో ఆభాగ్యులకు ఆసరా అందక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. మందుగోలీలకు, ఇతర ఖర్చులకు చెయ్యి చాచాల్సిన దుస్థితి నెలకొంది.

ఆసరా పింఛన్ పై చిన్నచూపు...

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభాగ్యుల పట్ల చిన్నచూపు చూస్తోంది. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆసరా పింఛన్లు నిలిపివేయడంతో అర్హులైన దరఖాస్తుదారు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 

గత ఆరేండ్ల కింద బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రజాపాలన ద్వారా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తోంది. కానీ ఇప్పటివరకు వాటికి మోక్షం లభించడంలేదు. అభాగ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందకపోవడంతో మండలంలో వందల మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయించడంతో ఆశలు చిగురిస్తున్నాయి.

మండలంలో రెండు వేలకు పైగా  దరఖాస్థులు...

మండల వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే కేవలం  మండలంలోనే  2000, దరఖాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన దరఖాస్తుదారులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 2022 ఆగస్టు వరకు నాటి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. అప్పటివరకు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను వెయిటింగ్ జాబితాలో పెట్టింది.

సధరం సర్టిఫికెట్  గడువు ముగుస్తున్న పింఛన్ రావట్లేదు

 2 సంవత్సరాల గడువుతో వైద్య అధికారు లు సధరం సర్టిపికెట్ జారీ చేశా రు. కానీ పించన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. దీనితో మళ్లీ సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పింఛ న్ రాక ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం స్పందించి పింఛన్ మంజూరు చేస్తే కొంత భారం తగ్గుతుంది. 

ఎస్ వెంకన్న, పాలకవీడు

వితంతు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న...!

బుచ్చమ్మ మాది  పాలకవీడు గ్రామం. నా భర్త  2022 లో మరణించారు. భర్తకు వుద్ధాప్య పెన్షన్ వచ్చేది. అతను చనిపోయి నాలుగు సంవత్సరాలు దాటినా నేటికీ వితంతు పెన్షన్ రావడంలేదు పెన్షన్ ఇప్పంచాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. మా గ్రామంలో నా భర్త తర్వాత చనిపోయిన మహిళలకు వితంతు పెన్షన్ వస్తుంది నాకే ఎందుకు రావడం లేదో అర్థంకావటం లేదు..

కె. బుచ్చమ్మ, పాలకవీడు