క్రీడల్లో మనమెక్కడ?
ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి మధ్యప్రదేశ్‌లోని షా డోల్ గ్రామ యువ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జీవిత ప్రయాణం గురించి ప్రస్తావించారు. వీరికి జర్మన్ ఫుట్ బాల్ ఆటగాడు, కో డైట్‌మార్ బీర్స్‌డోర్ఫర్ తమ దేశంలో శిక్షణకు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్ళు ఇతర దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న తీరును ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిపెద్ద జనాభా గల భారతదేశం క్రీడా రంగంలో చాటుతున్న సత్తా గురించి చర్చించుకోవాల్సిన అవసరముంది.
చదరంగం, క్యారమ్, పోలో, బ్యా డ్మింటన్ మొదలైన అనేక వైవిధ్యమైన ఆటలకు పుట్టినిల్లు భారత్. కబడ్డీ, ఖో-ఖో లాంటి సంప్రదాయ ఆటలకు దేశమంతటా బహుళ ప్రాచుర్యం పొందాయి. నేడు క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, చెస్ లాంటివి చలామణి అవడంతో సంప్రదాయ ఆటల ఉనికి ప్రశ్నార్థకంగా మా రింది. అథ్లెటిక్స్ లాంటి ఆటలకు ఆదరణ కరువవుతుంది. మరోవైపు ఆధునిక జవనశైలిలో ఆట లకు, శారీరక శ్రమకు విరామం ఏర్పడింది.
ఫలితంగా క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తి కూడా సన్న గిల్లుతుంది. రోజులో కనీసం ఒక గంట ఆరుబయట ఆడుకోవడం ఎంతో ముఖ్యమని నిపు ణులు పేర్కొంటున్నారు. ఆటలు ఆరోగ్యంతో పాటు శారీరక, మానసిక వికాసానికి తోడ్పడుతాయి. జీవితంలో గెలుపోటములను నేర్పి స్తాయి. ఓర్పు, సహనం, ఏకాగ్రత, ఏదైనా సాధించాలనే తపన, మానసిక స్థుర్యైం.. ఇవన్నీ ఆటల వల్లనే అలవడతాయి. కానీ నేడు బాల్యం దశ నుంచే క్రీడల స్ఫూర్తి కొరవడుతుంది.
కొరవడిన శారీరక దృఢత్వం
పాఠశాలలు కూడా కార్పొరేట్ శైలికి అలవాటు పడడంతో పిల్లలు క్రీడలకు దూ రమవుతున్నారు. మరోవైపు మొబైల్ ఫోన్ వాడ కం పెరిగిపోవడం.. ఆన్‌లైన్ ఆటలకు పిల్లలు బానిసవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో పిల్లల్లో ఒంటరితనం, ఒత్తిడి పెరిగిపోయి చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఆటలకు బీజం పడాల్సిన దశలో పాఠశాలల్లో సరైన ఆటస్థలం లేకపోవడం, శరీర దారుఢ్యానికి కావలసిన పౌష్టికాహారం, శిక్షణ సదుపాయాల కొరత, ఎంపికలో పారదర్శకత లోపించడం వంటి సమస్యలు క్రీడా స్పూర్తిని దెబ్బతీస్తున్నాయి.
దీంతో ఒలింపిక్ క్రీడల్లో భా రత్ పెద్దగా రాణించలేకపోతుంది. దేశంలో సామాజిక అంతరాలు, ఆర్థిక స్థితి క్రీడా ప్రతిభను వెనక్కి నెడుతుంది. అగ్రకులాల ఆధిపత్య ధోరణి వారి వర్గానికే చెందిన ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు లభించేలా చేస్తున్నాయి. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల్లో ప్రతిభ ఉన్నప్పటికీ అది వెలుగులోకి రాలేకపోతుంది. భారత్‌లో క్రికెట్ తో పోలిస్తే జాతీయ క్రీడగా పేరున్న హాకీకి చెప్పుకోదగిన ప్రోత్సాహం లేదు.
శారీరక ఆరోగ్యం, క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా’, ‘టార్గెట్ ఒలింపిక్స్ పోడియం’, ‘ఖేలో ఇండియా’ లాంటి కార్యక్రమాలను తీసుకువచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఇవేవీ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి 2001 జాతీయ క్రీడా విధానం స్థానంలో ‘జాతీయ క్రీడా విధానం పాలసీని తీసుకువచ్చింది. 20 36 ఒలింపిక్స్‌పై దృష్టి సారించి, భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచ క్రీడా శక్తి కేంద్రంగా మార్చడానికి లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విధానం లో జాతీయ విద్యా విధానంతో క్రీడల ఏకీకరణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి క్రీడలను ప్రోత్సహించనున్నారు. ప్రజా ఉద్యమంగా క్రీడలను ము ందుకు తీసుకువెళ్లనున్నారు. క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతను తీసుకురావాలి. జాతీయ క్రీ డా అభివృద్ధి నిధికి కార్పొరేట్ సంస్థల సాయంతో సమీకరించాలి.
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే పునాది ఏర్పరచాలి. ఆటలకు పాఠశాలలు వేదిక కావాలి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి పాఠశాలలో వ్యా యామ ఉపాధ్యాయులు నియమించాలన్నారు. విద్య మూల్యాంకనంలో క్రీడలకు కూడా మార్కులిచ్చేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీ డల తగినంత బడ్జెట్ కేటాయించాలి. అప్పుడే మ న క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతారు.
వ్యాసకర్త: సంపతి రమేష్ మహారాజ్






