calender_icon.png 5 February, 2026 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో సామాజిక న్యాయమేది?

05-02-2026 12:00:00 AM

డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ :

తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం నిజంగా ఆందోళనక రమైన విషయమే. కేంద్రం నుంచి గ్రాంట్లు తగ్గితే, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఇది నేరుగా రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన బీసీ సంక్షేమ పథకాలు, కుల వృత్తులకు ఇచ్చే సబ్సిడీలు, విద్యా పథకాలపై ప్రభావం చూపనుంది. 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. దీంతో రాష్ట్ర జనాభాలో మెజారిటీ ప్రజలైన బీసీలకు అన్యాయం జరిగేందుకు ఆస్కారమున్నది. 53.5 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగింది. వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకానికి కూడా పెద్ద ఎత్తున నిధుల కోత విధించింది. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. బీమా రంగం లో 100 శాతం ఎఫ్‌డీఐలు తీసుకురావాల ని బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు.

ప్రభుత్వ సంస్థల నుంచి రూ.47వేల కోట్ల వాటాలను ఉపసంహరించుకుంది,  రైతులకు, ఆహార రంగాల కు ఇచ్చే సబ్సిడీలోనూ కోత పెట్టారు. కేంద్ర బడ్జెట్‌లో సామాజిక వర్గానికి చెందిన బీసీ లు, ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించిన నిధు లు కూడా భారీగా తగ్గాయి. దీంతో ఈ వర్గానికి చెందిన విద్య, ఉపాధి, చిన్న వ్యాపారా లు, వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ భారీ గా దెబ్బతినే అవకాశహుంది.

దీని ప్రభావం ఎక్కువగా దేశంలోని బీసీల ఆర్థిక ఎదుగుదలపై పడనుంది. ఇక బడ్జెట్‌లో తెలంగాణ ప్రతిపాదించిన రూ. 1.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను (రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ) కేంద్రం విస్మరించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రంలో, -రాష్ర్టంలో వేర్వే రు పార్టీలు అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి తెలంగాణ ఒక ఉదాహరణ. 

దెబ్బతీసిన సఖ్యతలేమీ!

అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ, ఇటు రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాం గ్రెస్‌కు మధ్య సఖ్యత లేకపోవడం, ముఖ్యం గా ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌తో రాజకీయ విభేదాలు కేంద్ర బడ్జెట్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రాష్ట్ర అవసరాలపై కేం ద్రం ఉదాసీనంగా వ్యవహరించడంతో కేం ద్ర పథకాల్లోనూ రాష్ట్రానికి ప్రాధాన్యం త గ్గింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  60సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా, కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోవడాన్ని ప్రతిపక్షాలు ‘రాజకీయ వైఫల్యం’గా చూస్తున్నాయి.

ప్రధా ని మోడీతో ‘బడే బాయ్-చోటే బాయ్ బం ధం’ అని గతంలో ప్రచారం జరిగినా, బడ్జెట్‌లో అది ప్రతిఫలించలేదన్న విమర్శలు వస్తున్నాయి. అటు బీఆర్‌ఎస్ పార్టీ కూడా గ తంలోని అవినీతి ఆరోపణలు, అంతర్గత సమస్యల వల్ల కేంద్రంపై మునుపటిలా గట్టి గా ఒత్తిడి తీసుకురాలేకపోతున్నది.

ఆ పార్టీ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతుందన్న విమర్శలు పెరగిపోతున్నాయి. ఇక రాష్ర్టం నుంచి బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ లాభం లేకపోయింది. వారంతా రాష్ట్ర ప్రయోజనాల కంటే కేవలం పార్టీ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణ లు పెరగిపోతున్నాయి.

 బీసీలపై అధిక ప్రభావం:

తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం నిజంగా ఆందోళనక రమైన విషయమే. కేంద్రం నుంచి గ్రాంట్లు తగ్గితే, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఇది నేరుగా రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన బీసీ సంక్షేమ పథకాలు, కుల వృత్తులకు ఇచ్చే సబ్సిడీలు, విద్యా పథకాలపై ప్రభావం చూపనుంది. సెమీకండక్టర్ మిషన్ వంటి భారీ ప్రాజెక్టులు వేరే రాష్ట్రాలకు వెళ్లడం వల్ల స్థానిక బీసీ యువతకు అందాల్సిన ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయి.

రాజకీయ పార్టీల అగ్రనాయకత్వం ఇప్పటికీ కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే ఉండటం వల్ల, బడ్జెట్ చర్చల్లో ‘బీసీల ఆర్థికాభివృద్ధి’ అనేది ఒక ప్రధాన అజెండాగా మారడం లేదు. మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు నిర్ణయాత్మక శక్తి గల పదవుల్లో ఉంటే తప్ప.. ఢిల్లీ స్థాయిలో రాష్ర్టం కోసం చేసే పోరాటంలో ‘సామాజిక న్యాయం’ అనే కోణం బలంగా వినిపించదు.

పార్లమెంట్‌లో తెలంగాణకు సంబంధించిన అంశాలపై గట్టి పోరాటం, ఐక్యంగా డిమాండ్ చేయడం, జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచడం లాంటి వి పెద్దగా జరగడం లేదు. పార్టీల ప్రయోజనాలు ముందుకు రావడం, ప్రజా సమస్యలు వెనుకబడిపోవడం జరుగుతున్నది. జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ జాతీయ సమీకరణలకే ప్రాధాన్యత ఇస్తాయి. అందుకే, బలమైన ప్రాంతీయ ఆకాంక్షలు గల, బహుజన నాయకత్వం ఉన్న శక్తులు అధికారంలో ఉంటేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 

తెలంగాణకు అన్యాయం:

కీలక ప్రాజెక్టులైన ముసీ నదీ పునరుద్ధరణ(రూ.17,212 కోట్లు), రీజినల్ రింగ్ రోడ్ (రూ.34,367 కోట్లు), హైదరాబాద్ మెట్రో ఫేజ్--2 (రూ.44 వేల కోట్లు), వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, సెమీకండక్టర్ హబ్ వంటి 47 ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఊసే లేదు. మొత్తం రూ.1.63 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు నీరుగారిపోయాయి. డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీన్ని ‘అవమానకరం’, ‘అన్యాయం’గా అభివర్ణించా రు. లాభనష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్రానికి ఉన్నప్పటికీ, బడ్జెట్‌లో తెలంగాణ పేరు కూడా ప్రస్తావించలేదన్నారు.

కాంగ్రెస్-, బీజేపీ మధ్య ‘బిగ్ బ్రదర్- లిటిల్ బ్రదర్’ అవగాహన ఉన్నప్పటికీ,  సీఎం రే వంత్ 60సార్లు ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం లేకపోయిందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఎ ద్దేవా చేశారు. కేంద్రంలో ఒక పార్టీ (బీజే పీ), రాష్ర్టంలో మరొక పార్టీ (కాంగ్రెస్) దీ నిని ప్రధాన కారణంగా చూపిస్తున్నప్పటికీ సఖ్యతలేమీ తెలంగాణకు నష్టం చేసిం దని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కేం ద్ర,-రాష్ట్ర సంబంధాల్లో న్యాయం లేకపోవడం, రాజకీయాలకే పెద్ద పీట వేస్తే ప్రజా ప్రయోజనాన్ని పట్టించుకోవడం మన నేత లు ఎప్పుడో వదిలేశారు.

దీంతో పాటు రా ష్ట్రంలో మెజారిటీ వర్గాలైన బీసీలకు స్పష్టమైన ఆర్థిక అజెండా లేకపోవడం, ప్ర జలు ప్రశ్నించడంలో వెనుకడుగు వేస్తే న ష్టానికి దారి తీస్తుంది. అందుకే బీసీలు రాజకీయంగా మాత్రమే కాదు, ఆర్థి కంగా కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరముంది. అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు లేకపోతే సామాజిక న్యాయం కాగితాలకే పరిమితం అవుతుందన్న విషయం గ్రహించాలి.

 వ్యాసకర్త సెల్: 9177566741