గెలిచినా.. ఓడినా అభివృద్ధి సంక్షేమం కోసమే
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
అలంపూర్, జనవరి 4 : అలంపూర్ నియోజక వర్గం మానవపాడు, మండలం పల్లె పాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ .ఏ .సంపత్ కుమార్ అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల. మాల వేసి పల్లెపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు అలంపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ మాట్లాడుతూ, పంచాయితీ ఎన్నికల అనంతరం గెలిచిన ఏ ఊరికి కాకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయిన పల్లె పాడుకి వచ్చానని కార్యకర్తలు గెలిచిన ఓడిన అధైర్య పడాల్సిన అవసరం లేదు అని వారికి కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ అండగా ఉంటారని అన్నారు .
మరియు కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే అభివృధి సాధ్యం అని మొత్తం తెలంగాణ రాష్ట్రం లోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అలంపూర్ నియోజక వర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని అన్నారు. రాబోయే ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ ఓటు ద్వారా మద్దతు తెలిపి వారి ప్రాంత అభివృద్ధికి పాటు పడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమార్, గ్రామ నాయకులు బిసిరెడ్డి, మస్తాన్‌లతో గద్వాల జిల్లా కార్యదర్శి మహమ్మద్ సిరాజ్ మండల అద్యక్షులు జగన్ మోహన్ నాయుడు, వివిధ గ్రామాల సర్పంచిలు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




