calender_icon.png 10 January, 2026 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి

05-01-2026 12:07:56 AM

మేడ్చల్ అర్బన్ జనవరి 4 (విజయక్రాంతి):వైద్య ఖర్చుల కింద మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితునికి రాష్ట్ర మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పూడూరు, కిష్టాపూర్ డివిజన్ (పిఎస్) రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న దేవినూరి మహేష్ కుమారుడైన అన్వేష్ కంటి ఆపరేషన్ ఖర్చుల విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ నడికొప్పు ఉమా నాగరాజు సూచన మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ స్థానిక ఎమ్మెల్యే కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు.

బాధితునికి కంటి ఆపరేషన్ కింద మంజూరైన 35 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మల్లారెడ్డి,మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజుల చేతుల మీదుగా బాధితుడు అన్వేష్ తండ్రి మహేష్ కు అందజేయడం జరిగిందని వారు తెలిపారు.అదేవిధంగా మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డికి పూల బూకేతో 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని ఉమా నాగరాజు చెప్పారు.