calender_icon.png 11 January, 2026 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి

05-01-2026 12:06:22 AM

అలంపూర్, జనవరి 4:  గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు.ఆదివారం టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో క్యాతూరు గ్రామ సర్పంచ్ హరి అతని అనుచరులు సంపత్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాభివృద్ధి జరుగుతుందని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సర్పంచ్ హరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి,మహేష్ గౌడ్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.