11 May, 2026 | 1:10 AM

గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన విప్ ఆది

11-05-2026 12:00 AM

వేములవాడ, మే10,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డులో పెద్దమ్మ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన భగవంతరావు నగర్కు చెందిన ఊరడి భూమయ్యకు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండగా నిలిచారు.రూరల్ మండల పర్యటన ముగించుకొని వస్తున్న సమయంలో ప్రమాదాన్ని గమనించిన ఆది శ్రీనివాస్ వెంటనే వాహనం ఆపి క్షతగాత్రుడిని పరామర్శించి, ఆలస్యం చేయకుండా తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. విప్ చూపిన మానవత్వాన్ని స్థానికులు అభినందించారు.