11 May, 2026 | 1:31 AM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

11-05-2026 12:00 AM

43 ఏళ్లకు కలిసి చిన్ననాటి స్నేహితులు

జమ్మికుంట మే 10(విజయ క్రాంతి) 43 ఏళ్లకు చిన్ననాటి స్నేహితులు కలుసుకొని , ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఇల్లందకుంట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 1982 -83 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని ఆదివారం జమ్మికుంట పట్టణంలోని బి.వి.ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. 43 సంవత్సరాల తరువాత చిన్ననాటి మిత్రులు కలుసుకొని ఆనందంగా గడిపారు.

పాఠశాల రోజుల్లో తరగతి గదుల్లో చేసిన చిలిపి చేష్టలు, పాఠశాల ఆవరణంలో ఆడి పాడిన రోజులను గుర్తుకు చేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను దేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గోగుల సత్యనారాయణ, రావుల సారంగపాణి, గొల్లపల్లి రవీందర్, కూరపాటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.