18 August, 2026 | 3:30 PM

కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా

24-05-2024 12:40 AM

హెచ్‌ఎండీఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు

రాజేంద్రనగర్, మే 23 (విజయక్రాంతి) :  నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝులుపించారు. నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన నిర్మాణాలను గుర్తించి గురువారం అధికారులు కూల్చివేశారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్‌లో అనుమతులు లేని రెండు భవనాలను అధికారులు గుర్తించారు. జీ ప్లస్ 3 అనుమతి తీసుకొని ఆరు అంతస్తులను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ భవనాన్ని, జీ ప్లస్ 2 అనుమతులు తీసుకొని 7 అంతస్తుల వరకు నిర్మించిన మరో భవనాన్ని గురువారం కూల్చివేశారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ అధికారులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమంగా చేపట్టే నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ కూల్చివేతల్లో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమా ర్‌రెడ్డి, టీపీవో మణిహారిక, టాస్క్‌ఫోర్స్, హెచ్‌ఎండీఏ అధికారులు తదితరులు పాల్గొ న్నారు. కూల్చివేతల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు సిబ్బంది భద్రత కల్పించారు.