28 August, 2026 | 10:21 PM

కబ్జాపై కొరడా

11-06-2024 02:25 AM

ఈదుల చెరువుకు విముక్తి

రోడ్డును తొలగించిన మున్సిపల్ అధికారులు

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 10: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల చెరువు కబ్జాపై ఈ నెల 5వ తేదీన ‘ఈదుల చెరువులో ఇళ్ల స్థలాలు’ అనే శీర్షికన విజయకాంత్రిలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈదుల చెరువు కల్వర్ట్‌పై ఏర్పాటు చేసిన రోడ్డును సోమవారం ప్రజల సమక్షంలో తొలగించారు. ఇరిగేషన్ డీఈ ఉషారాణి, ఏఈ తస్ఫీన్ రజా, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు ఈదుల చెరువు దగ్గర వెళ్లి అక్కడ చెరు వు అలుగుపై నిర్మించిన రోడ్డును పరిశీలించి, నిర్మాణం అక్రమమని తేల్చారు.

దీంతో డీఈ ఉషారాణి ఫోన్ ద్వారా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ రవీందర్ దత్తుకు సమాచారం ఇచ్చారు. వెంటనే తహసీల్దార్ చెరువు దగ్గరకి వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ ఉషారాణి రోడ్డును తొలగించాలని తెలపగా, వారం రోజుల సమయం ఇవ్వాలని తహసీల్దార్ కోరారు. వారం రోజుల సమయం ఇవ్వొద్దని.. వెం టనే తొలగించాలని కౌన్సిలర్లు, ప్రజలు పట్టుబట్టారు.

తొలగించే వరకు అక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదని తహసీల్దార్‌ను అడ్డుకున్నారు. నిరసనలు ఆగకపోవడం తో తహసీల్దార్ పరిస్థితిని గమనించి రో డ్డును తొలగించాలని పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. దీంతో వెంటనే రెండు జేసీబీలను తెప్పిం చి రోడ్డును తొలగించారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈదుల చెరువు హద్దులు నిర్ణయించి కంచె వేయాలని ప్ర జాప్రతినిధులు, ప్రజలు కోరారు. కాగా, ఈ రోడ్డును ఓ వెంచర్‌కు రాకపోకలు సాగించేందుకు నిర్మించినట్టుగా స్థానికులు తెలిపారు.