28 August, 2026 | 9:07 PM

ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

11-06-2024 11:10 AM

అమరావతి: తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. విజయవాడ ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం జరుగుతోంది. కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మాణం చేశారు. తమ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్ పంపనున్నారు.  శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

సభానాయకుడిగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత మెజార్టీతో 161 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్డీయే కూటమిలో 21 లోక్ సభ స్థానాలను దక్కించుకుంది. ఎన్డీయే కూటమి తరుఫున చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్, పురంధేశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.