calender_icon.png 6 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరిది బాధ్యత?

06-12-2025 01:02:47 AM

సాయి ఈశ్వరాచారి మర ణం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. బాధి త కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకూడదు. ఇప్పటి వరకు ఏవిధమైన ఆత్మవిశ్వాసం, ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శించారో.. ఇకపై కూడా బీసీ సమాజం పోరాటం చేయాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ఒక చారిత్రక అవసరం. దీనికోసం పార్టీలకు అతీతంగా బీసీ నేతలంతా ఏకతాటిపైకి రావాల్సిన సమ యం ఆసన్నమైంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టింది. పార్లమెంట్ చట్ట సవరణ, 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని తెలిసినా హామీ ఇచ్చి బీసీలకు ఆశచూపింది. బీసీ వర్గాల ఓట్లతో అధికారాన్ని చేపట్టింది. కానీ రిజర్వేషన్ అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి చూపలేదు. ఇకపై బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి.

బీసీ ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీ స్థాయిలో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర బీసీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి రాష్ట్రంలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకూ ఉద్యమం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి రిజర్వేషన్ అమలు చేసేలా పోరాటాల గడ్డ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి. కానీ ఆత్మ బలిదానాల వైపు మొగ్గు చూపొద్దు.

బీసీ సమాజం అధైర్య పడొద్దు. ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు. రిజర్వేషన్ పొందడం బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కు. దశాబ్దాల కల నెరవే ర్చుకునేందుకు చేస్తున్న ఈ ఉద్యమంలో బీసీలకు అండగా ‘విజయ క్రాంతి’ పత్రిక నిలబడుతుంది.

బీసీ రిజర్వేషన్ సాధన ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతు, సహకారం అందిస్తుంది. బీసీల గొంతుకను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని, ఆవేదనతో కూడిన బీసీ ఉద్యమాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ‘విజయక్రాంతి’ పత్రిక ఎల్లప్పుడూ ముందుంటుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు ‘విజయక్రాంతి’ పత్రిక బీసీల వెన్నంటే ఉంటుంది.

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి