calender_icon.png 6 December, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్భుత ప్లాన్ ఇవ్వండి

06-12-2025 01:02:58 AM

-ఓయూను బెస్ట్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలి

-విద్యార్థులకు సరిపడా భవనాలు 

-భవనాల మరమ్మతుల కంటే కొత్తవే నిర్మిద్దాం

-వర్సిటీకి ఎంత ఖర్చైనా ఓకే..

-ఈనెల 31న వర్సిటీ పూర్తి ప్రణాళికను ప్రకటించాలి

-ఓయూ వర్సిటీ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

-ఈ నెల10న ఓయూకు రానున్న సీఎం

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ మహ ర్దశకు అద్భుత ప్లాన్ తనకు ఇవ్వాలని, ఓయూను బెస్ట్‌గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మాని యా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూ చించారు.

ఈనెల 31 యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన పూర్తి ప్రణాళికను ప్రకటించాలని ఆదేశించారు. ఈనెల 10న ఓ యూను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ అభివృద్ధి పనులపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఉ స్మానియా యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పా యింట్ ప్రజంటేషన్స్‌ను సీఎం వీక్షించారు. హాస్టల్ భవనాలు, రహదారులు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సీఎం సూచించారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే ఉన్న జల వనరులను సంరక్షిస్తూనే.. నూతన జలవనరుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలనూ పరి శీలించాలని ఆదేశించారు. హాస్టల్, అకడమిక్ భవనాల నిర్మాణం విషయంలో 100 మంది విద్యార్థులుంటే అదనంగా మరో పది శాతం విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలని సీఎం తెలిపారు. విద్యార్థులు, సి బ్బంది భవిష్యత్‌లోనూ ఎటువంటి అసౌకర్యాలు రాకుండా నిర్మాణాలు ఉండాలని పేర్కొన్నారు. 

బెస్ట్ యూనివర్సిటీగా తీర్చాలి..

ఉస్మానియా యూనివర్సిటీని ఈనెల 10వ తేదీన సందర్శించనున్నట్లు సీఎం రే వంత్‌రెడ్డి తెలిపారు. అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లను పరిశీలిస్తానని సీఎం తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి విద్యార్థులు, బోధనా సిబ్బంది అభి ప్రాయాలు స్వీకరించాలని అధికారులకు సూచించారు. తొలుత అభివృద్ధి నమూనా లు వారి ముందు ఉంచాలని.. తర్వాత వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్సు లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచిం చారు.

వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమి స్తూ ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి ప్రణాళికలపై తుదినిర్ణయం ఖరారు కావాలని సీఎం తెలిపారు. బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దాలన్నారు. ప్రపంచంతో పోటీపడేలా యూనివర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దాలని, యూనివర్సిటీ అధ్యాపకుల ను విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలని సూచించారు. వర్సిటీ వీసీ, ప్రొఫెసర్లతో అధికారులు యూనివర్సిటీలో పర్యటించాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేకకార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉస్మానియా విశ్వవిద్యాల యం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం తదితరులు పాల్గొన్నారు.

పోరాట చిహ్నాలు ఏర్పాటు..

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక, వారసత్వ భవనాలను సంరక్షించాలని సీఎం సూచించారు. చారిత్రక ప్రాధాన్యం లేని పురాతన భవనాలకు భారీ మొత్తాలు వెచ్చించి మరమ్మతులకు చేసే బదులు నూతన భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ పాత్‌లతో పాటు ప్రతి పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం తెలిపారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.