9 August, 2026 | 2:18 AM

మాయలేడి లవ్‌స్టోరీలో విలన్ ఎవరు?

09-08-2026 01:08 AM

రాకేశ్ వర్రే హీరోగా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న కొత్త సినిమా ‘మాయలేడి’. రాకేశ్ గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఎవరికీ చెప్పొద్దు’, ‘పేకమేడలు’ వంటి సినిమాలు నిర్మించి, అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు అదే బ్యానర్‌పై ‘మాయలేడి’ అంటూ మరో ఆసక్తికర కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ సినిమాకు ప్రశంకర్ దర్శకత్వం వహిస్తుండగా, మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్‌ల ప్రేమాయణం.. ‘మా మధ్యకు ఎవరైనా వస్తే ఊరుకోను..’ అంటూ హీరోయిన్ చేసే యాక్షన్ సన్నివేశాలు.. గ్లింప్స్ చివరలో ‘ఇప్పుడు నా లవ్‌స్టోరీలో విలన్ ఎవరో తెలుస్తోంది..’ అంటూ హీరో చెప్పే డైలాగ్ క్యూరియాసిటీ పెంచుతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.