17 April, 2026 | 3:07 PM

లక్ కిక్కెవరికో..?

27-10-2025 02:26 AM
  1. నేడు మద్యం షాపుల డ్రా

దరఖాస్తు దారుల సమక్షంలోనే ప్రక్రియ

ఏర్పాట్లు పూర్తి చేసిన అబ్కారీ శాఖ  

అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలి 

ఎక్సుజ్ కమిషనర్ హరికిరణ్ అదేశాలు 

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): మద్యం వ్యాపారుల టెన్షన్ కొద్ది గంటల్లోనే తగ్గిపోనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నమ్ముకున్న ‘మద్యం’వ్యాపారం ముంచుతుందా? లక్ కిక్కు అనేది తేలిపోనుంది. తెలంగాణలోని 2,620 మద్యం షాపులకు వచ్చిన 95,137 దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం డ్రా తీయనున్నారు. 

మద్యం షాపుల కు వచ్చిన దరఖాస్తులను డ్రా (లాటరీ)  పద్ధతిలో  దుకాణాల లైసెన్స్‌ల ఎంపిక జరుగు తుంది. జిల్లాల వారీగా సోమవారం ఉద యం 11 గంటలకు మద్యం షాపులకు దరఖాస్తుదారుల సమక్షంలోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఎక్సై జ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డ్రా తీసే చోట  అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు..

అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు, కుమ్ర భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680, మంచిర్యాలలో 73 షాపులకు 1712, నిర్మల్‌లో 47 షాపులకు 3002, హైదరాబాదులో 82 షాపు లకు 3,201, సికింద్రాబాద్‌లో  97 షాపులకు 3022, జగిత్యాలలో 71 షాపులకు 1966, కరీంనగర్‌లో 94 షాపులకు 2,730, పెద్దపల్లి 77  షాపులకు 1,507, రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1,381, ఖమ్మంలో 122 షాపులకు 4430, కొత్తగూడెం 88 షాపులకు 3,922, జోగుళాంబ  గద్వాలలో 36 షాపులకు 774,

మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు  2487,  నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1,518, వనపర్తిలో 37 షాపులకు 757,  మెదక్‌లో 49 షాపులకు 1,920, సంగారెడ్డి 101 షాపులకు 4432, సిద్దిపేట్‌లో 93 షాపులకు 2782, నల్లగొండ 155 షాపులకు 4,906, సూర్యపేట్‌లో  99 షాపులకు 2771, యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2776,  కామారెడ్డి 49 షాపులకు 1502,నిజామాబాద్ 102 షాపులకు 2786, మల్కాజిగిరిలో 88 షాపులకు 5168, మేడ్చల్‌లో  114 షాపులకు 6063, 

సరూర్‌న గర్‌లో 134 షాపులకు 7,845, శంషాబాద్‌లో 100 షాపులకు 8,536 వికారాబాద్ 59 షాపులకు 1808, జనగామాలో 47 షాపులకు 1697,  భూపాలపల్లి 60 షాపులకు 1863, మహబూబాబాద్‌లో 59 షాపు లకు 1800, వరంగల్ రూరల్‌లో 63షాపులకు 1958, వరంగల్ అర్బన్‌లో 65 షాపుల కు 3175 దరఖాస్తులు వచ్చాయి.