calender_icon.png 27 October, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లిక్కర్’ లక్కీ ఎవరిదో?

27-10-2025 09:14:40 AM

శంషాబాద్ లో నేడు డ్రా

కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల  ఆధ్వర్యంలో వైన్స్ కేటాయింపులు

గతేడాదితో పోలిస్తే తగ్గిన దరఖాస్తులు 

రంగారెడ్డి జిల్లాలో 249 షాపులకు 16,381 దరఖాస్తులు

రూ. 491.కోట్ల ఆదాయం

రంగారెడ్డి,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం శంషాబాద్ లోని మల్లికా కన్వెన్షన్ లో  మద్యం దుకాణాలకు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రాలు తీయనున్నారు. జిల్లా వారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొన సాగ నుంది. జిల్లాలో  కార్పొరేషన్, మున్సిపాలిటీలతో పాటు చుట్టుపక్కల ఉన్న మద్యం దుకాణాలకు  భారీగా డిమాండ్ నెలకొంది. శంషాబాద్ పరిధిలో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536, సరూర్నగర్లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు రావడం గమనార్హం. జిల్లాలో వైన్స్ టెండర్ల కోసం గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తగ్గినప్ప టికీ ఆదాయం మాత్రం తగ్గ లేదు. రంగారెడ్డి జిల్లాలో 249 షాపులకు మొత్తం 16,381 దరఖాస్తులు రాగా  దరఖాస్తుల ద్వారానే  రూ.491 కోట్ల ఆదాయం సమకూరిన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో దుకాణాలకు  రూ. 2 లక్షల ఉండగా ఈ దపా ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచింది. డ్రా లో దుకాణాలు దక్కించుకున్న యజమానులకు రెండేళ్లు వరకు మద్యం విక్రయించేందుకు  పర్మినెంట్లు ప్రభుత్వం ఇవ్వనుంది.

మొదలు మందకొడిగా..

వైన్స్ షాపుల లైసెన్స్ కోసం దరఖా స్తుల ప్రక్రియ  నోటిఫికేషన్ జారీ  చేసిన మొదలు మందకోడిగానే దరఖాస్తుల ప్రక్రియ సాగింది.ఈనెల 18నే వాస్తవానికి దరఖాస్తుల ప్రక్రియ  చివరి తేదీ కాగా, మళ్లీ ప్రభుత్వం బీసీ బంద్ కారణంగా మళ్లీ ప్రభుత్వం గడువు 23కు పెంచింది. శంషాబాద్ ఎక్సెజ్ పరిధిలోని 111 షాపులకు 8,536 దరఖాస్తులు రాగా.. రూ.256.08 కోట్ల ఆదాయం వచ్చింది.  సరూర్ నగర్ ఎక్సెజ్ సూపరింటెండెంట్ పరిధి లోని 138 షాపులకు గాను 7,845 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని   ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనల్లు, షాద్ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్ ఎక్సెజ్ డివిజన్ల పరిధిలో 134 షాప్ లు ఉండగా మొత్తం 10,994 దరఖా స్తులు వచ్చాయి. శంషాబాద్ ఎక్సెజ్ సూపరింటెండెంట్ పరిధిలో చేవెళ్ల,రాజేంద్ర నగర్ నియోజకవ ర్గంలో పలు మద్యం  దుకాణాలకు భారీ గా డిమాండ్ పెరిగింది. రాజేంద్రనగర్  నియోజకవర్గం లోని  బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి లోని షాప్ నెం.58 కి అత్యధి కంగా 143 దరఖాస్తులు రాగా ఇదే కార్పోరేషన్ పరి ధిలోని షాప్ నెం.59కి 125 దర ఖాస్తులు రావడం గమనార్హం. రాజేంద్ర నగర్ పరిధిలోని షాప్ నెం.54కు 125 దరఖాస్తులు, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని షాప్ నెం.63కు 125, షాప్ నెం.66కు 125, రాజేంద్ర నగర్ లోని షాప్ నెంబర్ 47కు 117 దరఖాస్తులు వచ్చాయి.