11 March, 2026 | 10:43 PM

తెలంగాణలో మొంథా ఎఫెక్ట్

27-10-2025 02:24 AM
  1. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఐదు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై పడనుంది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఆది వారం తీవ్ర వాయిగుండంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాగల 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి తుఫానుగా మారి నైరుతి బంగళాఖాతం, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశముందని తెలిపింది. ఈ తుఫాను తొలుత వాయవ్య దిశలో తదుపరి ఉత్తర వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి ఈ నెల 28 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాముందని పేర్కొంది. ఆ తర్వాత వాయవ్య దిశలోనే కదులుతూ 28న సాయ ంత్రానికి ఏపీలోని మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని సూచించింది. 

ఈ నెల 31 వరకు వర్షాలే..

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన కారణంగా సోమవారం నుంచి ఐదు రోజులు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 27న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, 28న భారీ వర్షాలు, 29న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూ డెం, మహబూబాబాద్ జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలెర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో కురుస్తాయ ని తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

బుధవారం జయశంకర్ భూపా లపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిలాలో కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాల్లో ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, శుక్రవారం 25 జిల్లాల లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.