22 May, 2026 | 4:00 AM

హైదరాబాద్ లో ఇరాన్ కేఫ్ లు ఎందుకు మాయం అవుతున్నాయి ?

22-08-2024 01:46 PM

హైదరాబాద్: నగరంలో  ఒకప్పుడు ఎక్కడ చూసినా గల్లీ.. గల్లీ కి ఇరాన్ కేప్ లు దర్శనమిచ్చేవి. చాయ్ నేపథ్యంలో చాయ్ దోస్తు లు  నిత్యం కేప్ ల్లో కూచుని చాయ్ సమోసా తాగుతూ గంటల తరబడి ముచ్చటించుకునే వారు. నిజామ్ నవాబు కోడలు నీలో ఫర్ పేరుతో కేప్ చాలా ఫేమస్. వంద ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కేఫ్లు లు భారత దేశానికి ఇరాన్ నుంచి కొంతమంది  పర్షియన్ వర్తకులు పరిచయం చేశారని చెబుతారు. తొలుత పలు కేఫ్ లను పార్సీ సామాజిక  వర్గం యాజమాన్యంలో నడిచేవి. కాల క్రమంలో మార్పులు చోటు చేసుకున్నాయని చాయ్ పైన రీసెర్చ్ చేసిన విశ్లేషకులు చెబుతున్నారు.

చాలా ఇరానీ కేఫ్‌లు అద్దెకు తీసుకోబడిన బిల్డింగ్ల నుంచి నిర్వహించబడుతున్నాయి ఇక్కడ హాయిగా విశ్రాంతి టీ తాగుతూ సేదదీరుతారని   రూజ్ తెలిపారు. కానీ హైదరాబాద్‌లో నానాటికీ పెరుగుతున్న స్థిరాస్తి ధరలు చాలా మంది యజమానుల కు టీవ్యాపారాన్ని గిట్టుబాటు లేకుండా చేశాయన్నారు.ప్రస్తుత తరం వారు కేఫ్ మరియు రెస్టారెంట్ వ్యాపారంపై ఆసక్తి చూపడం లేదని ప్రసిద్ధి చెందిన ఫరాషా రెస్టారెంట్ యజమాని మహమూద్ అన్నారు.కేఫ్ యజమానుల పిల్లలు   ఇతర ఉద్యోగాలు చేయడం, కేప్ లోని వాతావరణం ఇష్టపడక పోవడం కారణమని పేర్కొన్నారు. చాలా మంది వారసులు అమెరికా, దుబాయ్  తదితర  దేశాలకు వలసపోవడం కూడా కారణమన్నారు. విపరీతంగా పెరిగిన "ద్రవ్యోల్బణం కారణంగా కేప్ లు  నష్టపోతున్నయన్నారు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే టీ పొడి మరియు పాల ధరలు మూడు రెట్లు పెరిగాయి" అని వివరించారు.

వ్యాపారంలోకి ప్రవేశించే ఇరానీ కుటుంబాల సంఖ్య కూడా తగ్గిందని మరికొందరు చెబుతున్నారు. కాగా సవాళ్లు ఉన్నప్పటికీ, ఆటుపోట్లకు వ్యతిరేకంగా కొందరు ఇప్పటికీ  కేఫ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాురు. సయ్యద్ మహ్మద్ రజాక్ హైదరాబాద్‌లోని రెడ్ రోజ్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. రజాక్ తాత టెహ్రాన్ నుండి వలస వచ్చి 1970లలో సిటీ లైట్ హోటల్‌ను స్థాపించారు. తర్వాతకాలంలో రజాక్ తండ్రి రెడ్ రోజ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాని తెలిపారు.