నీట్‌పై మోదీ మౌనమెందుకు?
విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా స్పందించరా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, జూన్ 18: నీట్ అవకతవకల విషయంలో ప్రధాని మోదీపై కాం గ్రెస్‌నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణపై విద్యార్థులు, విపక్ష పార్టీలు ధర్నాలు చేస్తున్నా మోదీ ఎందుకు స్పం దించడం లేదని ప్రశ్నించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నా ఏమీ పట్టనట్లు మోదీ మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకుల నేపథ్యంలో దృఢ విధానాలను తీసుకొచ్చేందుకు పార్లమెంట్ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే పాలిత బీహార్, గుజరాత్, హర్యానాల్లో జరిగిన అరెస్టులు నీట్‌లో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకులకు అడ్డాగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేపర్ లీకేజీలు కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.






