09-12-2025 02:31:42 AM
ముషీరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీద ఉన్న చిత్త శుద్ది బీసీ రిజర్వేషన్ల పైన ఎందుకు లేదని బీసీ పొలిటికల్ ప్రంట్ ప్రశ్నించింది. ఈ మేరకు సోమవారం చిక్కడపల్లిలోని పొలిటికల్ ప్రంట్ కార్యాల యంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, వైస్ చైర్మన్ సుగురి దుర్గ య్య గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ లు మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీద ఉన్న చిత్తశుద్ది బీసీ రిజర్వేషన్ల పైన చూపి ఉంటే ఇప్పటికే పార్లమెంట్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత వచ్చేదని వారు మండిపడ్డారు.
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీలను డిప్యూటీ సీఎం పార్లమెంట్ సభ్యులతో వెళ్లి ఆహ్వానించారని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రస్తావించకుండా ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అబద్దాలు చెప్పడం సరైంది కాదన్నా రు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో మద్దతు కోసం ఎందుకు పంపించలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమా ండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ ప్రంట్ కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్, బోయ గోపి, వి. నాగభూష ణం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.