09-12-2025 02:33:04 AM
ప్రభుత్వ భూమిలో నిర్మించిన షెడ్ల తొలగింపు
శేరిలింగంపల్లి, డిసెంబర్ 8 (విజయక్రాంతి) : మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త బాబుపేట విలేజ్ సర్వే నంబర్ 44/5 లో గల ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యక్తులు గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ షెడ్లను ఏర్పాటు చేసుకొని వాటిని చిరు వ్యాపారస్తులకు రెంట్ కు ఇచ్చి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వ భూమి ని తమ సొంత భూమిగా అనుభవిస్తున్నారని కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు సోమవారం భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అనంతరం కంచెతో పాటు హైడ్రా బోర్డును ఏర్పాటు చేశారు. అనంతరం హైడ్రా ఆదికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించిన వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.