3 September, 2026 | 1:26 AM

ఓబీసీలపై అస్పష్టత ఎందుకు?

03-09-2026 | 12:00am

ప్రొ.సంగని మల్లేశ్వర్ :

భారత రాజకీయ చరిత్ర(Indian political history)లో ‘మండల్(Mandal)’ ఒక మలుపు. నేడు ‘కులగణన(Caste census)’ మరో చారిత్రక మలుపు. అయితే, అప్పట్లో సామాజిక న్యాయం(social justic) కోసం లేవనెత్తిన గొంతులను ‘మెరిట్’ పే రుతో అణచివేయాలని ప్రయత్నించిన శ క్తులు కనిపించాయి. ఇప్పుడు అదే సామాజిక న్యాయానికి గణాంక ఆధారం ఇవ్వా ల్సిన సమయం వచ్చినప్పుడు రిజర్వేషన్ల(reservations)ను వ్యతిరేకించే స్వరాలు మళ్లీ వీధుల్లోకి రావడం యాథృచ్ఛికమా? అవే  గొంతులా అనే విధంగా ఢిల్లీ(Delhi)లోని జంతర్‌మంతర్ వేదికగా జరిగిన ‘రిజర్వేషన్ హఠావో ఆం దోళన్’ ఈ ప్రశ్నను మరింత తీవ్రం చేసిం ది.

బీజేపీ సర్కార్(BJP government) రిజర్వేషన్లను రద్దు చే యాలని అధికారికంగా నిర్ణయించిందని చెప్పడానికి స్పష్టమైన ఆధారం లేకపోయినా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినాదా లు వినిపిస్తున్న సమయంలో కేంద్రంలోని అధికార నాయకత్వం ఆ ఉద్యమ ప్రతినిధులతో సమావేశం కావడం రాజకీయ చర్చ కు దారితీసింది. రిజర్వేషన్ వ్యతిరేక శక్తులతో చర్చకు సిద్ధంగా ఉన్న అధికార పార్టీ ఓబీసీల గణాంక న్యాయం కోసం పోరాడుతున్న శక్తుల డిమాండ్లపై ఎందుకు అదే స్థాయి రాజకీయ చొరవ చూపడం లేదు? అన్న ప్రశ్న ఓబీసీల మదిలో నానుతున్న ది.

మౌనం ఎల్లప్పుడూ తటస్థతకు గుర్తు కాదు, కొన్ని సందర్భాల్లో అది పరోక్ష స మ్మతిగా ప్రజల్లో భావన కలిగిస్తుంది. విచిత్రమేమిటంటే జంతర్‌మంతర్ ఆందోళన లో రిజర్వేషన్ వ్యవస్థను కేవలం ‘సంస్కరించాలి’ అనే స్థాయిలో కాకుండా, కులాధారిత రిజర్వేషన్ల మూలసూత్రాలనే ప్ర శ్నించే నినాదాలు వినిపించాయి. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి.

 భారతదేశంలో సామాజిక న్యాయం కోసం బీసీ సంఘాలు నిత్యం దేశవ్యాప్తం గా ఉద్యమాలు చేస్తున్న క్రమంలో ససేమిరా అన్న కేంద్రం 2027 జనగణనలో కులగణన చేస్తామని హామీ ఇచ్చినట్టుగానే శ్రీకారం చుట్టింది. కానీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్టుగా ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఇవ్వలేదు. ఇది కేవలం ఓబీసీల ఒక కాలమ్ సమస్య కాదు. ఇది ప్రాతినిధ్యాన్ని లెక్కించే విధానానికి సంబంధించిన ప్రశ్న.

ఎస్సీ, ఎస్టీలకు జనగణనలో ప్రత్యేక గుర్తింపు, వర్గీకరణకు చారిత్రకంగా వ్యవస్థ ఉంది. కానీ ఓబీసీల విషయంలో అదే స్థాయి స్ప ష్టత లేకపోతే, దేశంలోని అతిపెద్ద సామాజికవర్గాల్లో ఒకటైన ఓబీసీల సంఖ్యను కచ్చితంగా ఎలా నిర్ధారిస్తారు? యాదవ, గౌడ్, ముదిరాజ్, పద్మశాలి, నాయీబ్రాహ్మణ, విశ్వకర్మ, కుమ్మరి, చాకలి, పెరిక, సగర, వడ్డెర వంటి కులాలకు యూనిక్ కోడ్ లేకుండా నమోదైతే, ఆ కులాలు ఓబీ సీ జాబితాలో ఉన్నాయా, లేదా? అన్నది ఎలా తెలుస్తుంది.

కేవలం పేర్లను సేకరించడం వేరు, వాటిని శాస్త్రీయంగా ఓబీసీ వ ర్గంలో లెక్కించడం వేరు. అందుకే ఓబీసీల కోసం స్పష్టమైన వర్గీకరణ, ప్రామాణిక కో డ్‌లు, రాష్ట్రాల వారీగా సమన్వయం, పారదర్శక డేటా అవసరం. తెలంగాణలో ఎన్ని కల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో భా గంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం  2024 సామాజిక, -ఆర్థిక సర్వేలో ఓబీసీలను ప్రత్యే క సామాజికవర్గంగా గుర్తించి కులాలవారీగా వివరాలు సేకరించిన విధానం కూడా ఈ చర్చకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

1990లో మండల్ రాజకీయాలు బలపడిన సమయంలో హిందూ సమాజాన్ని మతపరమైన అంశాల చుట్టూ సమీకరించే రాజకీయ ప్రక్రియ కూడా బలపడింది. అందుకే ఆ దశను రాజకీయ విశ్లేషకులు ‘మండల్ వర్సెస్ కమండల్’ కాలంగా అభివర్ణించారు. నేటి కులగణన వర్సెస్ రిజర్వే షన్ చర్చ కూడా ఆ పాత రాజకీయ సమీకరణాలకు కొత్త రూపాన్ని ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాడు మండల్ కమిషన్ సిఫారసుల అమలు సమయం లో రిజర్వేషన్లను వ్యతిరేకించిన వర్గాలు ‘మెరిట్’ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించాయి.

కానీ సామాజిక న్యాయవాదు ల ప్రశ్న మాత్రం అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటే: అవకాశాలు సమానంగా లేని సమాజంలో ఫలితాలను మాత్రమే ‘మెరిట్’తో కొలవడం ఎలా సాధ్యం అవుతుం ది? శతాబ్దాలుగా విద్య, భూమి, అధికార వ్యవస్థలు, సామాజిక ప్రతిష్టలో అసమానతలు ఉన్నప్పుడు అందరికీ ఒకే ప్రారంభ స్థానం ఉందని భావించడం వాస్తవికతకు దూరం కదా? రిజర్వేషన్ అనేది పేదరిక ని ర్మూలన పథకం కాదు.

భారత రాజ్యాంగం గుర్తించిన సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని అధిగమించి ప్రాతినిధ్యం కల్పించే ఒక సామాజిక న్యాయ సాధనం. మండల్‌ను ఎదుర్కొన్న కమండల్ చరిత్రగా మిగిలిపోవచ్చు. కానీ, సామాజిక న్యాయం కోసం గణాంకాల ఆధారంగా జరిగే పోరాటం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ మెరిట్‌కు శత్రువు కాదు, సామాజిక అసమానతకు ఒక రాజ్యాంగ పరిష్కారం తప్ప వేరే మార్గం లే దు. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ‘మేము రిజర్వేషన్లకు అనుకూలం’ అని చెప్పడం మాత్రమే సరిపోదు.

 దేశవ్యాప్తంగా కులగణనపై చర్చ జరుగుతున్న సమయంలోనే ‘రిజర్వేషన్ హఠా వో ఉద్యమం’ పేరుతో ఢిల్లీలో బహిరంగ నిరసనలు నిర్వహించారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే నినాదాలు వీధుల్లో వినిపిస్తున్నప్పుడు, అధికార పార్టీ రాజ్యాంగ బద్ధమైన సామాజిక న్యాయం పక్షాన దృఢంగా నిలవాలి. స్వాతంత్య్రం సిద్దించి 80 సంవత్సరాలు కావచ్చినా ఓబీసీల బతుకులు మారలేదు.

ఈ వ్యతిరేకత కేవ లం రిజర్వేషన్లపై చర్చగా కాకుండా, భారత రాజకీయాల్లో సామాజిక న్యాయం వర్సెస్ మత, సాంస్కృతిక సమీకరణాల మధ్య పోరాటంగా కూడా విశ్లేషణలు వినిపించాయి. ఆ ఉద్యమం వెనుక ఏ రాజకీయ పార్టీ ఉన్నదో అర్థం చేసుకోనంత వెనుకబడి బీసీ సమాజం లేదు. ఇంకా జెన్ జీ తరహాలో తనను రాజకీయ పార్టీలకు స్వ తంత్రమైన పౌర ఉద్యమంగా ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ వర్గాల నుంచి ప్రారంభ దశలో స్పష్టమైన రాజకీయ ఖండన లేకపోవడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి.

జంతర్‌మంత ర్‌లో జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక పోరాటానికి బీజేపీ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చిందని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, దీనిపై అధికార పార్టీ స్పష్టమైన ఖండన, దృఢమైన రాజకీయ వైఖరి ప్రకటించకపోవడం పరోక్ష మద్దతుపై అను మానాలకు తావిస్తోంది. ఇదే అదనుగా ప్రభుత్వమే ఉద్యమం వెనుక ఉందనే అనుమానం బలపడే విధంగా ఉద్యమకారుల కు చేసిన రాచమర్యాదలే నిదర్శనం. 

 ఓబీసీల గొంతు కోసే విధంగా జనా భా లెక్కల ప్రశ్నావళి ఉందని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. ఓబీసీ కాలమ్ లేకుండా రూపొందించిన ఫార్మాట్ రద్దు చేయాలని, తప్పులతడక అంటూ ఆగస్టు 20న లేఖ రాసింది. వాస్తవానికి డీలిమిటేషన్ మీద నిలదీసినట్టు ఓబీసీల పక్షాన పార్లమెంట్ వేదికగా గొంతెత్తితే బీజేపీ ఈ వివక్ష కనబర్చేది కాదనే అభిప్రాయం ఓబీసీ సమా జంలో ఉంది. రిజర్వేషన్లు ఎవరి దయాదాక్షిణ్యం కాదు.

అవి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. వాటిని బలహీనపరిచే ప్రతి ప్రయత్నాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి భారతీయుడు ప్రశ్నించాలి. రిజర్వేషన్లపై మౌనం వహించడం అంటే సామాజిక న్యాయానికి ద్రోహం చేయడమే. రాజ్యాంగ హక్కులను రక్షించడం ప్రతి రాజకీయ పార్టీకి బాధ్యత.

అద్దంలో కనిపించే వాస్తవాలను మార్చడానికి ప్ర యత్నించడం కంటే, వాస్తవాలను అంగీకరించి సమానత్వం వైపు అడుగులు వేయ డమే ప్రజాస్వామ్య భారతదేశానికి సరైన మార్గం. మండల్ వర్సెస్ కమండల్ ఉద్య మం నుంచి కులగణన వర్సెస్ నిరాకరణ వరకు ఒకే వర్గం, ఒకే పార్టీ అడ్డుపడుతున్నదనే భావన 80 కోట్ల మంది ఓబీసీ లలో ఉన్నది. ఇప్పటికైనా ప్రశ్నావళిలోని 10వ క్రమసంఖ్యలో ఓబీసీ కాలమ్ కేటాయించి, కులానికి ఒక యూనిక్ కోడ్ కేటా యించి బీసీ బిడ్డగా చెప్పుకొనే మోదీ, స్పష్టమైన విధానంతో తన చిత్తశుద్ధి చాటాల్సిన అవసరం ఉంది.

 వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ

విభాగాధిపతి, 9866255355