పెంచిన పింఛన్ల సంగతి మాట్లాడరెందుకు?
కాంగ్రెస్ ప్రభుత్వానికి వృద్ధుల ఉసురు తగలుతుంది
‘ప్లుయాష్’ స్కాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తారా?
ప్రమాణం చేస్తే క్షమాపణ చెప్తా: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని, సర్కార్‌కు పింఛనుదారులైన అవ్వాతాతల ఉసురు తగిలి తీరుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారంమాట్లాడారు. ప్లుయాష్ స్కాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోలేదని అపోలో వెంకటేశ్వరస్వామి ఒట్టేసి చెబితే తాను బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తాను ఆలయానికి చేరుకుంటానని, అక్కడికి మం త్రి పొన్నం కూడా వస్తే బాగుంటుందన్నారు. ఒకవేళ ఆలయానికి రాకుంటే తాను మీడి యా ముందు మరికొన్ని నిజాలు బయటపెడతానన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనీయకుండా అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.
జీవో నంబర్ 18 ప్రకారం చెక్కుల పంపిణీ చేసే బాధ్యత స్థాని క ఎమ్మెల్యేకే ఉంటుందన్నారు. ఈనెల 27 లోపు చెక్కుల సమయం ముగుస్తుందని, ఆ తర్వాత మం త్రి పొన్నం లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్తారో నిర్ణయంచుకుని సిద్ధం గా ఉండాలన్నారు. కొందరు బీఆర్‌ఎస్‌ను వీడుతున్నా రని, వారి వల్ల తమ పార్టీకి పెద్ద గా నష్టమేమీ ఉండదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నిక ల్లో తిరిగి అధికారం బీఆర్‌ఎస్‌దేనన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలకంటే బీఆర్‌ఎస్‌కే క్యాడర్ బలంగా ఉందని పేర్కొన్నారు. పదేం డ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని ఏ ఒక్కరూ చెప్పలేరని వెల్లడించారు.






