24 April, 2026 | 3:16 AM

హామీలు అమలెందుకు చేయలేదు?

24-04-2026 01:44 AM
  1. ప్రభుత్వంపై అన్ని వర్గాల వారు ఆగ్రహం
  2. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా అవుతున్నా హామీలెందుకు అమ లు చేయడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదని, అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారన్నారు.

బీఆర్‌ఎస్ హయంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఆ ఫైల్‌ను గవర్నర్ దగ్గరకు పంపించామని, కానీ ఆ తర్వాత బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలో ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామన్లు ఇవ్వొద్దని టెంట్ హౌస్ వారికి పోలీస్ హెచ్చరిక జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారని, దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. కాళేశ్వరం కేసు హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభు త్వానికి చెంపపెట్టు లాంటిదని తలసాని శ్రీనివాస్ అన్నారు.      సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.