14 March, 2026 | 1:46 AM

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

07-02-2026 12:18 AM

49వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కర్ణకంటి ఉమారాణి సదానందం

కరీంనగర్‌లోని 49వ డివిజన్‌లో కార్పొరేటర్ అభ్యర్థి విస్తృత ప్రచారం

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): నగరపాలక సంస్థ ఎన్నికల్లో 49వ డివిజన్లో పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించి కార్పొరేటర్‌గా గెలిపించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్‌ఎస్ అభ్యర్థి కర్ణకంటి ఉమారాణి సదానం దం అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

డివిజన్‌లోని ప్రధా న సమస్యలను పరిష్కరించడంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య పనులు మెరుగుపడేలా చూస్తానని. కొత్తగా వీధిదీపాలను ఏర్పాటు చేయిం చడంతోపాటు పని చేయని వాటికి మరమ్మతు చేయిస్తానని అన్నారు.ఉమారాని కి మద్దతుగా మాజీ కార్పొరేటర్ రాజేందర్‌రావు, ఏవైసి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.