6 April, 2026 | 5:00 PM

Breaking News

దేశ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం   •   బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సన్మానించిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి   •   కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •  

భర్తపై కత్తితో భార్య దాడి

30-11-2024 02:43 AM

ఖమ్మం, నవంబర్ 29 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో భర్తపై భార్య కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం లో శుక్రవారం చోటు చేసుకుంది. గొల్లపూడి గ్రామానికి చెందిన పోరళ్ల  రవికి, లక్ష్మీతో ఏడాది క్రితం వివాహమైంది.

విద్యాశాఖలో పని చేస్తున్న రవి తరచూ మద్యం సేవించి విధులకు హాజరవుతుండటంతో ఉద్యో గం నుంచి తొలగించారు. అయినా మారని రవి మద్య సేవించి అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా గొడవ పడటంతో కోపంతో లక్ష్మి కత్తితో రవిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.