23 June, 2026 | 7:34 PM

Breaking News

ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •  

అనుమానంతో భార్య హత్య

18-03-2026 12:00 AM

సనత్‌నగర్, మార్చి 17 (విజయ క్రాంతి):- సనత్నగర్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచు కున్న భర్త కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన వాసు (40), భార్య రేణుక (38)తో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వాసు తరచూ గొడవ పడుతుండేవాడు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వా దం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో కోపోద్రిక్తుడైన భర్త కత్తితో రేణుక గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుం చి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సనత్నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిం పు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.