20 May, 2026 | 1:33 AM

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా

20-06-2024 12:05 AM
  • గద్వాల ఎమ్మెల్యే బండ్ల స్పష్టం

గద్వాల (వనపర్తి), జూన్ 19 (విజయక్రాంతి): తాను చివరివరకు బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతానని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల  కృష్ణమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. తాను బీఆర్‌ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం  అవాస్తమని చెప్పారు. బుధవారం గద్వాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై పోరాడతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను సంప్రదించిన మాట వాస్తమేనని, పార్టీ మారడంపై తనకు ఎలాంటి ఆలోచన లేదన్నారు.