ప్రజల సంక్షేమానికి కృషి
నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలుస్తా
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, జూన్ 19: కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షే మం కోసం కృషి చేస్తానని, అవసరమైతే సీఎంను కూడా కలుస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. బుధవారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. గడిచిన ఆరు నెలలుగా ఏ ఒక్క డివిజన్‌లో అభివృద్ధి పనులు జరగడంలేదని కార్పొరేటర్లు ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమా రు రూ.65కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులకు టెండర్లు పిలిచినా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసిన పనులను ఎందుకు ప్రారంభించడంలేదని అధికారులను ప్రశ్నించారు. నియోజకవర్గ పరిధిలోని చెరువులు మురుగు నీటితో కలుషితమై గుర్రపు డెక్కతో నిండి ఉన్నాయని, వాటిని శుభ్రపరచాలని సూచించారు. కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, పండాల సతీష్‌గౌడ్, శిరీషా బాబురావు, ఆవుల రవీందర్‌రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, మందాడి శ్రీనివాసరావు, కూకట్‌పల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ సతీష్ అరోరా పాల్గొన్నారు.






