4 June, 2026 | 1:38 AM

న్యాయవాదుల రక్షణ చట్టం అమలును స్వాగతిస్తున్నాం

04-06-2026 12:53 AM
  1. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు
  2. తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్దన్ రెడ్డి

ముషీరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): న్యాయవాదుల రక్షణ చట్టం-2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగా ణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్దన్ రెడ్డి అన్నారు. తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం-2026ను అధికారికంగా అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ  సందర్భంగా బుధవారం కవాడిగూడ లోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులిహార గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ   న్యా యవాదుల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులకు అభినందనలు తెలిపారు. చట్టం ప్రకారం న్యాయవాదులకు తప్పుడు కేసుల నుంచి రక్షణ, వృత్తి నిర్వహణలో భద్రత కల్పించేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. న్యాయవాదులపై వేధింపులు, దాడులు లేదా ఇతర సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక యం త్రాంగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అలాగే కొన్ని కేసుల్లో బెయిల్కు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేయడం తో పాటు, న్యాయవాదుల అరెస్టులకు న్యాయస్థానం అనుమతి అవసరమయ్యే విధంగా చట్టంలో నిబంధనలు ఉన్నాయని వివరించారు. నేరాల తీవ్రతను బట్టి గరిష్ఠంగా ఏడు సంవత్సరాల వరకు శిక్షలు విధించే అవకాశం కూడా చట్టంలో పొందుపరిచినట్లు తెలిపారు.

అదే సమయంలో న్యాయవాదులు తమ వృత్తి ధర్మానికి, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినా వారిపై కూడా చర్యలు తీసుకునే నిబంధనలు చట్టంలో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని న్యాయవాదులు బాధ్యతాయుతంగా తమ వృత్తిని నిర్వహిస్తూ, సమాజంలో న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంక్షేమం, భద్రతకు దోహదపడే ఈ చట్టాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.