తీపి కబురందేనా?

17-09-2026 | 05:30am

రాష్ట్ర ప్రభుత్వంతో రేపు ఉద్యోగ జేఏసీ భేటీ

ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి, పెన్షనర్లు

డిమాండ్లపై జేఏసీ నేతలు వెనక్కి తగ్గొద్దంటూ ఒత్తిడి తెస్తున్న కింది స్థాయి ఉద్యోగులు

ప్రభుత్వం ససేమిరా అంటే.. పోరాటానికి పిలుపునివ్వాలని ఉద్యోగులు పట్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల్లో(Telangana Employee) ప్రస్తుతం ఒకటే చర్చ -నడుస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభు త్వంతో ఫైట్ చేయాలా? లేక వాయిదావేసిన ఉద్యమానికి బ్రేక్ ఇవ్వాలా? అనే మీమాంసలో ఉద్యోగ సంఘాల జేఏసీ(Joint Action Committee of Employee Unions) ఉందా అని. ఈనెల పదో తేదీన తలపెట్టిన భారీ ఉద్యోగుల సభను ప్రభుత్వ హామీతో చివరి నిమిషంలో వాయిదా వేయడం, అప్పటినుంచి జేఏసీ నేతల్లో కనిపిస్తు న్న మౌనం ఉద్యోగుల్లో తీవ్ర ఆసంతృప్తికి కారణమవుతోంది.

రేపు (18న) తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు(Gazetted Officers), ఉపాధ్యాయులు(Teachers), కార్మికుwలు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (తెలంగాణ ఉద్యోగుల జేఏసీ) ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయం(State Secretariat)లో ప్రభుత్వం కీలక సమావేశం కానుంది. ఇందులో సీఎస్‌తోపాటు ఇతర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ సమా వేశంపైనే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లంతా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం హమీల గురించి స్పష్టమైనా ప్రకటన చేస్తుందా? లేకుంటే మళ్లీ దాటవేస్తుందా? అనే అనుమానాలు ఉద్యోగవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 

ఓపిక నశిస్తున్న ఉద్యోగులు..

తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు ఆరు డీఏలు పెండింగ్, దాదాపు రూ.11 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పీఆర్సీ అతీగతీ లేదు. పీఆర్సీ గడువు ముగిసే- మూడేళ్లు అవుతోంది. సీపీఎస్ కారణం గా పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ కాలంలో సరిపడా పెన్షన్ అందక కుటుంబాలు గడవడమే కష్టమవుతోంది. ఉద్యోగుల సొమ్ము స్టాక్ మార్కెట్‌లో ఆవిరైపోతుంది. ఉద్యోగులకు రావాల్సిన బిల్లులు, రిటైరైన ఉద్యోగుల బెనిఫిట్స్ నెలల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈహెచ్‌ఎస్ కార్డు అన్ని ఆసుపత్రుల్లో అమలు కావడంలేదు.

సరే ఇవన్నీ ప్రభుత్వానికి ఆర్థికపరమైన అంశాలు. ఆర్థికేతర అంశాలైన 317 జీవో లాంటి సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆవేదన, అసంతృప్తి. ఈ నేపథ్యంలోనే ఈనెల 10వ తేదీ సభకు ఉద్యోగులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. సభకు ప్రభుత్వం అనుమతిని వ్వ కుంటే జేఏసీ నేతలు హైకోర్టుకు వెళ్లి సభ నిర్వహణకు కూ డా అనుమతి తెచ్చుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి హా మీరావడంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 

వీటిపై స్పష్టత వచ్చేనా?

ఉద్యోగుల జేఏసీ సభ నిర్వహణకు సిద్ధమవుతున్న క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈనెల 9న జరిగిన సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. సీపీఎస్ రద్దుకై నిపుణులు, ఉద్యోగ సం ఘాలతో కమిటీ వేస్తామని, పీఆర్సీ రిపోర్టును తక్షణమే సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. దీంతోపాటు పెండిగింగ్ బిల్లులు, డీఏలపై ఈనెల 18న భేటీ అవుతామని లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో సభను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఈ అంశాలపైనే జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చించనుంది. జేఏసీ ప్రతినిధులు సైతం ఈ హామీలపైనే పట్టుబట్టనున్నారు.

ఒక వేళ ఆరోజు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే ఈనెల 19న తమ జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఉద్యమ బాటను ప్రకటిస్తామని జేఏసీ చెబుతోంది. మరోవైపు మూడు డీఏలు, తక్షణ పీఆర్సీ అమలు కోసం పట్టుబట్టాలని జేఏసీపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం అనుకూలంగా ప్రకటన చేయకుంటే అదే వేదికపై నుండి భవిష్యత్ పోరాటానికి పిలుపునివ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి మరో అవకాశమివ్వొద్దని పేర్కొంటున్నారు. జేఏసీ నేతలు సైతం ఉద్యోగుల డిమాండ్ల సాధనకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు