18 August, 2026 | 12:27 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

నన్ను జైల్లో వేస్తారేమో..

08-04-2025 01:32 AM

టీచర్లకు అన్యాయం  జరగనివ్వను: మమత 

కోల్‌కతా, ఏప్రిల్ 7: టీచర్లకు మద్దతుగా నిలిచి పోరాడుతున్నందుకు తనను జైల్లో వేస్తారేమో అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇటీవల సుప్రీం తీర్పుతో ఉద్యోగా లు కోల్పోయిన టీచర్లతో సోమవా రం కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో దీదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఆ తీర్పును ఒప్పుకున్నట్టు అనుకోకండి.

మేము బండరాళ్లం కాదు.. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను జైలులో పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ అవేమీ నేను పట్టించుకోను. అర్హులు ఉద్యోగాలు కోల్పోవడాన్ని నేను భరించలేను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకూ కొలువులు కాపాడుతాను’ అని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న 25,753 మందిని సుప్రీం కోర్టు అనర్హులుగా ప్రకటించింది. కొంత మం ది దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ తొలగింపు నుంచి సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. గతంలో హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే వెలువరించింది.