18 August, 2026 | 1:19 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

తహవూర్ రానాకు ఎదురుదెబ్బ

08-04-2025 01:29 AM

భారత్‌కు అప్పగించొద్దన్న వినతిని తోసిపుచ్చిన అమెరికా సుప్రీం కోర్టు

వాషింగ్టన్, ఏప్రిల్ 7: పాకిస్తాన్ మూలాలున్న కెనడా వ్యాపారవేత్త, 2008 ముంబై దాడుల ప్రధాన సూత్రదారి తహవూర్ రానా(64)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముంబై దాడుల కేసులో భారత్‌కు అప్పగించొద్దని రానా చేసిన విజ్ఞప్తిని అమెరికా సుప్రీం కోర్టు కొట్టేసింది.

ప్రస్తుతం రానా లాస్ ఏంజెల్స్‌లోని మెట్రో పాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. రానా విజ్ఞప్తిని అమెరికా సుప్రీం కోర్టు గతంలోనే తిరస్కరించినా కానీ ఆయన మరోమారు ‘ఎమర్జెన్సీ అప్లికేషన్’ దాఖలు చేశారు. తాజాగా ఆ దరఖాస్తును కూడా కోర్టు కొట్టివేసింది.