‘నిరసన’కు వెళ్తున్న కార్యకర్తలను అరెస్టు చేస్తారా..

09-09-2026 | 05:10am

ప్రశ్నించిన బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్

సికింద్రాబాద్,సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కౌరవుల పాలనను తలపిస్తోందని బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన 7 రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. 

నిన్న అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ప్రతినిధుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించిన ఘటనను నిరసిస్తూ, కంటోన్మెంట్ వార్డు నెం. 4 పరిధిలోని గాంధీనగర్లో నల్ల దుస్తులతో భారీ నిరసన చేపట్టాలని మన్నె క్రిషాంక్ పిలుపునిచ్చారు.అయితే, ఉదయం నుంచే మన్నె క్రిషాంక్ కార్యాలయం వద్దకు నల్ల దుస్తులతో చేరుకుంటున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం ప్రారంభించారని ఆరోపించారు.

అనంతరం మన్నె క్రిషాంక్ను కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ అదుపులోకి తీసుకుని ఖార్ఖానా పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు మన్నె క్రిషాంక్తో పాటు దాదాపు 25 మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఖార్ఖానా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు.

అనంతరం వారిని విడుదల చేశారు.విడుదల అనంతరం మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును హరిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అరెస్టులకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని తెలియజేస్తూ కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడేందుకు వెళ్తున్నారనే సమాచారం తెలుసుకుని, ఆ దాడిని అడ్డుకునేందుకు కేటీఆర్ కేసీఆర్ నివాసానికి బయలుదేరగా,

ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం తెలంగాణ పోలీసుల అత్యంత అమానవీయ, దురదృష్టకర చర్య అని మండిపడ్డారు.ఒక కొడుకు తన తండ్రి నివాసంపై జరగబోయే దాడిని అడ్డుకోవడానికి వెళ్తుంటే అతడినే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని క్రిషాంక్ ప్రశ్నించారు. మరోవైపు, కేసీఆర్ నివాసంపై దాడికి వెళ్తున్నామని బహిరంగంగా చెబుతున్న వారికి పోలీసులు బందోబస్తు కల్పించడం ఏ విధమైన పాలనకు నిదర్శనమని నిలదీశారు.

కేసీఆర్ నివాసంపై దాడిని అడ్డుకోవడానికి వెళ్తున్న కేటీఆర్ గారిని అరెస్టు చేసి, దాడికి వెళ్తున్నామని చెబుతున్న వారికి రక్షణ కల్పించడం రాక్షస పాలనకు పరాకాష్ట అని మన్నె క్రిషాంక్ విమర్శించారు.కేటీఆ్ప దాడికి ముందస్తు ప్రణాళికతోనే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు?కేటీఆర్ను ఉద్దేశపూర్వకంగానే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని మన్నె క్రిషాంక్ ఆరోపించారు.

కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ గెలిచిన ఏకైక నియోజకవర్గమని, బీఆర్‌ఎస్కు బలమైన ఆధిపత్యం ఉన్న నగరంలో కేటీఆ్ప దాడి చేయాలనే ముందస్తు ప్రణాళికతోనే ఆయనను కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని ఆరోపించారు.

కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు కేటీఆ్ప దాడికి ప్రయత్నించడాన్ని ప్రస్తావిస్తూ, క్రిషాంక్ తీవ్ర హెచ్చరిక చేశారు.కంటోన్మెంట్ కాంగ్రెస్ వన్టైమ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రూ.2 వేల ఇచ్చి గెలిచిన వారని, ఆయనను నమ్ముకొని 15 మంది కేటీఆర్ మీద దాడికి ప్రయత్నించి అనవసరంగా వీపులు పగలగొట్టించు కున్నారు. సామరస్యంగా ఉన్న కంటోన్మెంట్ వాతావరణాన్ని చెడగొట్టొద్దు అని క్రిషాంక్ హెచ్చరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ కార్యకలాపాలు సాగుతున్న కంటోన్మెంట్లో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు విరమించుకోవాలని  క్రిషాంక్ సూచించారు. ఈ కార్యక్రమంలో మన్నె క్రిషాంక్తో పాటు ప్యారసాని శ్యామ్ కుమార్, కిరణ్ కుమార్, మీనా భాస్కర్, రావుల సతీష్, యాసీన్, సత్యనారాయణ, మాధురి, ఆల్ ఆనంద్, రఘు, మోని, ఝాన్సీ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు