12 July, 2026 | 9:59 PM

'స్వయంభూ’లో సుందరవల్లిగా..

13-12-2024 12:00 AM

నిఖిల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభూ’. పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ 20వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో వారియర్‌గా కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా నభా నటేష్ క్యారెక్టర్‌ని సుందర వల్లిగా పరిచయం చేస్తూ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌లో నభా నటేష్ రాయల్ ట్రెడిషనల్ లుక్‌లో చాలా అందంగా కనిపించారు. సుందర వల్లి పాత్రలో సాఫ్ట్ అండ్ ఛార్మింగ్ స్ముల్‌తో ఆకట్టు కున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.