దేశభక్తి కథాంశంతో..
చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పుడు ఆయన కథానాయకుడిగా మరో నూతన చిత్రం రానుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను స్టార్ హీరో సందీప్ కిషన్ ఆదివారం విడుదల చేశారు.
ఈ పోస్టర్ చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కనిపించడంలేదు. ఈ కథలో దేశభక్తికి సంబంధించిన అంశాల్ని కూడా జోడించినట్టు తెలుస్తోంది. ఐదు రూపాయల బిళ్ల, దానిచుట్టూ ఉన్న బుల్లెట్లు చూస్తుంటే మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే సినిమా రాబోతోందని అర్థం అవుతోంది. జైరామ్ చిటికెల ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీకే ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ మూవీ టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు.






