18 April, 2026 | 10:30 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

బేకింగ్ సోడా ఉపయోగాలు

01-06-2025 12:00 AM

బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని అంటారు. అలాగే.. దీనిని సోడా, తినే సోడా, వంట సోడా అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీంతో ఎన్నో ఉపయోగాలుంటాయి. దోసెలు, ఇడ్లీలు, రొట్టెలు వంటివి మెత్తగా రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా వేస్తే చాలు. అలాగే అరగ్లాసు నీటిలో చెంచా వంటసోడా వేసి పుక్కిలిస్తే నోటి దుర్వాసన దూరమవుతుంది.

ఒక్కోసారి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు గ్లాసు నీటిలో అరచెంచా బేకింగ్ సోడా కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. బేకింగ్ సోడా కలిపిన నీళ్లతో అరచేతులను శుభ్రం చేసుకుంటే మురికి మాయమవుతుంది. బేకింగ్ సోడా కలిపిన గోరువెచ్చని నీళ్లలో అరగంటపాటు పాదాలను ఉంచండి. పాదాలకు పట్టిన మురికి వదిలిపోతుంది.

అలాగే దీంతో గ్యాస్ స్టవ్, బాత్రూమ్, కార్పెట్లను క్లీన్ చేయొచ్చు. బేకింగ్ సోడాలో కాస్త వేడి నీరు, వెనిగర్ కలిపి పేస్ట్‌లా చేసి శుభ్రం చేయాలనుకున్న ప్రదేశంలో రాయాలి. పావుగంట తర్వాత అక్కడ బ్రష్‌తో రుద్దితే మురికి శుభ్రమవుతుంది.