calender_icon.png 2 July, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్స్‌తో.. ఒత్తిడి చిత్తు

29-06-2025 12:00:00 AM

ఈ ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక శాతం మంది నగరవాసులు ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ప్రశాంతత ఒక విలాసంగా మారుతున్నది. ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువులే మిత్రులుగా ఎంతో సహాయపడుతున్నాయి.

ఈ విషయంలో ఇటీవల మార్స్ పెట్‌కేర్, మెడిటేషన్ యాప్ కామ్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. 20 దేశాల్లో 31 వేలమందిపై నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌కు చెందిన వెయ్యిమంది పెంపుడు జంతువుల యజమానుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

పెంపుడు జంతువుల కారణంగా భారతీయుల్లో 92 శాతం మంది తమ స్క్రీన్ టైమ్ తగ్గిందని చెబుతుండగా.. 93 శాతం మంది రోజువారీ పనుల మధ్య బ్రేక్ తీసుకోవడానికి పెంపుడు జంతువులే ప్రేరణగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే 82 శాతం మంది పెంపుడు జంతువులతో మాట్లాడటం ద్వారా రిలాక్సేషన్ పొందుతున్నామని, ఒంటరి తనానికి దూరం అవుతున్నామని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌లోని మార్స్ కార్యాలయం కూడా భాగస్వామ్యమైంది. 

సర్వేలో ఏముందంటే..

ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 79 శాతం మంది భారతీయులు నిద్ర బాగా పడుతోందని చెబుతుండగా, అదే అమెరికాలో ఇది కేవలం 55 శాతం మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు 88 శాతం మంది ఆలోచనల్లో ఆవేశం తగ్గిందని, 76 శాతం మంది ఆ క్షణాలను ఆస్వాదించే పరిస్థితుల్లో ఉన్నామని వెల్లడించారు. ఈ డేటా కేవలం గణాంకాలుగా కాకుండా.. మానసిక శ్రేయస్సులో పెంపుడు జంతువుల ప్రభావాన్ని తేటతెల్లం చేస్తున్నది. 

మానసిక ప్రశాంతతకు

పెంపుడు జంతువులకు అనుకూలంగా హైదరాబాద్‌లోని మార్స్ కార్యాలయం పెంపుడు జంతువలతో మానసిక ప్రశాంతత ఈ సర్వే ద్వారా మార్స్, కామ్ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్ యాప్‌లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్ మెడిటేషన్లు, మైండ్‌ఫుల్‌నెస్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తున్నది. హైదరాబాద్‌లోని మార్స్ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. మాయా, మైలో వంటి పెట్ అసోసియేట్స్‌తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే..

పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు.. ఆరోగ్యంగా బతకడానికి, హాయిగా జీవించడానికి ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి. ఈ సర్వే ద్వారా మార్స్, కామ్ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్ యాప్‌లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్ మెడిటేషన్లు, మైండ్‌ఫుల్‌నెస్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు.