calender_icon.png 2 July, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్పర్థలు వద్దు!

29-06-2025 12:00:00 AM

చాలావరకూ గొడవలు ఎందుకొస్తాయో తెలుసా? సరిగా కమ్యూనికేషన్ లేకే. ఇద్దరూ తమ వాదన చెబుతారే కానీ.. అవతలి వాళ్ల కోణమేంటో తెలుసుకోరు. అర్థం చేసుకోవట్లేదని తిరిగి ఇద్దరూ బాధపడుతుంటారు. ఏ విషయంలోనైనా గొడవొచ్చినా మనస్పర్థలు ఎదురైనా ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చోండి. ముందు అయిదు నిమిషాలు ఒకరు మాట్లాడాలి. ఆ సమయంలో ఎదుటివ్యక్తి నోరు విప్పకూడదు.

మాట్లాడేవారూ ఎదుటివారిని నిందించకుండానే సమస్య గురించి చెప్పాలి. సమయం పూర్తవగానే మరొకరు తమ మనసు విప్పాలి. ఇద్దరి కోణాలూ తెలుస్తాయి. ఎదుటివారిని నిందించొద్దు కాబట్టి.. మొదట మాట్లాడే వ్యక్తి దృష్టంతా సమస్య మీదే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఇక రెండో వాళ్లు తర్వాత వాళ్లకి సమాధానమివ్వాలని చెప్పింది జాగ్రత్తగా వింటారు.

మొదటివాళ్లలాగే వీళ్లూ తమ కోణాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూ చెబుతారు. నిందించడాలు లేనప్పుడు కేవలం సమస్యే తెరమీదకి వస్తుంది. కాబట్టి పరిష్కారం కనుక్కోవడం సులువవుతుంది. ఇద్దరు మనసు విప్పి మాట్లాడతారు. అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది. దీంతో పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలు పెడతారు. కలిసి పరిష్కరించుకుంటారు.