21 June, 2026 | 1:42 PM

కలెక్టరేట్‌లో ఇదేం జరుగుతోంది?

05-02-2026 12:46 PM
  1. కలెక్టర్ తనిఖీల్లో బట్టబయలు 
  2. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగుడి నిర్వాకం 
  3. విద్యుత్ దుర్వినియోగం పై అసహనం 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్(Collectorate) సముదాయంలో గల వివిధ శాఖల కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్ కె . హరిత(District Collector K. Haritha) ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ ఫీల్డ్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ అనే ఉద్యోగి తన స్థానంలో ప్రైవేటు వ్యక్తిని నియమించి తన విధులను చేయించడం కలెక్టర్ సాక్షిగా పట్టబయలు అయింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తాజా వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

దీంతోపాటు మరో కార్యాలయంలో పట్టపగలు విద్యుత్ దీపాలు వెలగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లైట్లు స్విచ్ ఆఫ్ చేసేందుకు సమయం లేకపోతే తనకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే నేనే వచ్చి లైట్లు ఆఫ్ చేస్తానని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల నర్సింగ్ కాలేజీ తనిఖీ చేసిన సమయంలో వార్డెన్ వినోద అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లడంతో పాటు బాధ్యతారహితంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె దృష్టికి రావడంతో  నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పరిపాలన పై ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్ సమగ్ర సమాచారాన్ని సేకరించి మరింత ప్రక్షాళన చేయాల్సి ఉందని బహిరంగంగా చర్చ జరుగుతుంది. బాధ్యతలు తీసుకున్న 15 రోజుల వ్యవధిలోనే ప్రక్షాళన మొదలుపెట్టడం పట్ల సర్వత్ర చర్చ జరుగుతుంది. కలెక్టర్ పర్యటన విషయాలను ముందుగానే సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ తనిఖీల వ్యవహారంపై లీకేజీ చేస్తున్న వ్యక్తులపై కూడా నిఘ పెట్టాల్సిన అవసరం ఉంది.

తాజా బ్రేకింగ్ న్యూస్ కోసం విజయక్రాంతి న్యూస్‌ను సందర్శించండి.*


ప్రశ్నలు – సమాధానాలు:


1. బినామీ ఉద్యోగి ఘటన ఎక్కడ జరిగింది?

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది.


2. ఈ విషయం ఎలా బయటపడింది?

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో బయటపడింది.


3. ఏ శాఖలో ఈ ఘటన జరిగింది?

ల్యాండ్ అండ్ సర్వే శాఖలో జరిగింది.